కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, కల్లేడు గ్రామానికి చెందిన గడ్డంసమ్మయ్య అనే నిరుపేద కుటుంబంపై రాత్రి కురిసిన భారీ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. పెంకుటిల్లు కావడంతో వర్షం ధాటికి పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనతో ఆ కుటుంబం నిరాశ్రయులై, తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, కనీసం ఒక ఇల్లు అయినా నిర్మించి ఇవ్వాలని సమ్మయ్య వేడుకుంటున్నాడు. గ్రామస్తులు కూడా ఆ కుటుంబం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.