హత్య కేసులో నిందితుల అరెస్టు

రామగిరి మండలం సెంటినరీకాలనీలో జరిగిన కోట చిరంజీవి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేకనే పథకం ప్రకారం నిందితులు చిరంజీవిని హత్య చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ శనివారం వెల్లడించారు. హత్య కేసులో నిందితులైన పెంచికల్ పేటకు చెందిన పోలవెన సంధ్యా రాణి, అనవేన మల్లయ్య, నరేష్, కుమార్, చందులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ వివరించారు.

సంబంధిత పోస్ట్