పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆదివారం ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో రూ. 29 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 12కోట్లతో ధూళికట్ట నుండి ముప్పిటితోట మీదుగా ర్యాకల్ దేవుపల్లి వరకు నూతన బిటి డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతన ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించి మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో ఉంటుందని ఆయన అన్నారు.