కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

శనివారం ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని లక్ష్మిప్రసన్న ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండలంలోని 36 మంది లబ్ధిదారులకు రూ. 36,04,176 విలువైన చెక్కులను మండల తహసీల్దార్ ధీరజ్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్