ఉచిత తేనెటీగల పెంపకం శిక్షణ

సింగరేణి సంస్థ రామగుండం-3 ఆధ్వర్యంలో ప్రభావిత, పరిసర ప్రాంతాల మహిళలకు ఉచిత తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతులు గురువారం సిఎన్ సిఒఎ క్లబ్ లో ప్రారంభమయ్యాయి. ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు మాట్లాడుతూ, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పన్నూరు, రత్నాపూర్, కల్వచర్ల, బేగంపేట్, నవాబ్ పేట్, నాగేపల్లి, ఆదివారం పేట, లద్నాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది మహిళలకు ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. సింగరేణి సిఎస్ఆర్ కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్