ఎల్లారెడ్డిపేటలో తేనెటీగల దాడి

మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఇద్దరు రైతులపై తేనెటీగలు దాడి చేశాయి. రవీందర్ రెడ్డి తన పొలంలో జెసిపి సహాయంతో చెట్లను తొలగిస్తుండగా, మరో రైతు అక్కడికి వెళ్ళాడు. మామిడి చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వీరిపై దాడి చేశాయి. జెసిపి డ్రైవర్, క్లీనర్ గ్లాస్ డోర్స్ వేసుకొని తృటిలో తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇరువురు రైతులను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్ లో తరలించారు.

సంబంధిత పోస్ట్