సిరిసిల్ల: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మంగళవారం ఉదయం సుమారు 9 గంటలకు కొత్త బస్ స్టాండ్ వద్ద గుర్తు తెలియని 40-45 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 5'6" ఎత్తు, గుండ్రటి ముఖం, చామనచాయ రంగులో ఉన్న మృతుడు ఎరుపు రంగు చొక్కా, గ్రీన్ రంగు ప్యాంటు, గ్రీన్ కలర్ బనియన్ ధరించి ఉన్నాడు. అతని ఎడమ చేతిపై 'సుజాత' అని, కుడి చేతిపై 'S.S' అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 8712656366 (N. శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) లేదా 8712656368 (Ch. శ్రీకాంత్, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) నంబర్లకు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్