సిరిసిల్ల: భర్త మృతదేహం కోసం కేంద్రమంత్రికి లేఖ

రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం, కంచర్ల గ్రామానికి చెందిన దేవోల్ల హన్మంత్, బహరేన్‌లో నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 16 నెలల క్రితం ఉపాధి కోసం బహరేన్ వెళ్లిన హన్మంత్, గ్రామంలో రూ.6 లక్షల అప్పు చేసి వెళ్లారని, అప్పు తీరకముందే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమను అనాధలను చేసి వెళ్లిన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి సహాయం చేయాలని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మృతుని భార్య కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు వినతిపత్రం ద్వారా వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్