వేములవాడ పట్టణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఏడవ రోజున, పట్టణంతో పాటు గ్రామాల్లోని అమ్మవారి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి నగర్ లోని శ్రీ శక్తి భవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా చండీ హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారి మండపాల అలంకరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.