AP: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో లక్షదీపోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. పుష్కరిణి హారతితో కార్యక్రమం కన్నులపండువగా సాగింది. ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు, భక్తులు కలిసి లక్ష దీపాలు వెలిగించి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను ఆరాధించారు. దీపాల కాంతులతో శ్రీశైలం క్షేత్రం ప్రకాశించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేలాదిమంది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.