కార్తీక పౌర్ణమి సందర్భంగా నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీనిని బీవర్ సూపర్‌మూన్‌గా పిలుస్తారు. పౌర్ణమి సమయంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రావడం వల్ల ఇలా కనపడుతుంది. ఈసారి చంద్రుడు భూమికి మరింత దగ్గరగా ఉంటాడు, సాధారణ పౌర్ణమి కన్నా 7 శాతం పెద్దగా, 16 శాతం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. టెలీస్కోప్‌తో చంద్రుడిని స్పష్టంగా చూడవచ్చు.