ఫిరాయింపు సంస్కృతికి పితామ‌హుడు కేసీఆర్: సీతక్క

TG: నూత‌న రాష్ట్రంలో ఫిరాయింపు రాజ‌కీయాల‌కు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఫిరాయింపు సంస్కృతికి పితామ‌హుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. 'ప‌రాయి పార్టీల్లో గెలిచిన తల‌సాని, సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్ర‌మాణం చేయించిన చ‌రిత్ర బీఆర్ఎస్‌ది. నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించారా? నాడు రాజ్యంగాన్ని ఉల్ల‌ఘించిన మీకు రాజ్యంగ ధ‌ర్మాస‌నాన్ని ఆశ్ర‌యించే నైతిక హ‌క్కు లేదు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్