గోదావరి-జనకచర్ల కుట్రకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీజాలు పడ్డాయని MLC ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన ఆయన.. బేసిన్లు లేవు భేషజాలు లేవని ఆంధ్ర పాలకులకే వంతపాడారని విమర్శించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను బలిపెట్టారని చెప్పారు. బనకచర్లపై మాట్లాడే కనీస నైతికత కేసీఆర్, ఆయన పార్టీకి లేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణకు నష్టం జరిగిందన్నారు.