KCR మాటలతోనే గోదావరి జలాలను కృష్ణాకు తరలించేందుకు జగన్ ప్రయత్నించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఏపీ ప్రాజెక్టుల గురించి కేసీఆర్, హరీశ్‌రావు మాట్లాడలేదు. జగన్ దిగిపోయి.. చంద్రబాబు సీఎం కాగానే జలాల సెంటిమెంట్‌తో కేసీఆర్ రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు గారిని భూతం లాగా చూపించడానికి కేసీఆర్ ఫామ్‌హౌజ్ లోపల కూర్చొని కుట్రలు, క్షుద్రపూజలు చేసినట్టు ఆలోచన చేస్తున్నారు." అని సీఎం అన్నారు.