భారత్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తొలుత ఈనెల 3న నిర్వహించాలనుకుంది. అయితే దేశంలో పండగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. కాగావక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.