పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ను స్కూళ్ల ద్వారా పూర్తిచేయాలని భావిస్తుంది. 5, 15 సంవత్సరాల వయసు నిండిన పిల్లలు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల డేటాను నిర్వహించే UDISE+ యాప్ లో విద్యార్థుల బయోమెట్రిక్ స్టేటస్ కనిపించేలా మార్పులు చేశారట. దీంతో స్కూల్ యాజమాన్యం ఆధార్ అప్డేట్ పై విద్యార్థులను అలర్ట్ చేస్తుంది.