తెలుగురాష్ట్రాల్లో వీధి వీధుల్లో వినాయక చవితి వేడుకలకు అంతా సిద్ధం అయింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. బుధవారం వినాయక చవితి ఉత్సవాలు మొదలుకానుండగా.. మంగళవారమే భక్తులకు మహాగణపతి దర్శనమిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. కొందరు భక్తులు బడా గణేశ్ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.