ఖమ్మం జిల్లాలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్టీ జనరల్ కేటగిరీకి కేటాయించారు. కూసుమంచి, కొణిజర్ల స్థానాలు ఎస్టీ జనరల్ కు, తిరుమలాయపాలెం, సత్తుపల్లి స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కనుంది. జనరల్ స్థానాల్లోనూ ఎస్టీలకు పోటీ చేసే అవకాశం ఉన్నా, జిల్లాలో నాలుగు స్థానాలే ఉండటంతో తీవ్ర పోటీ కారణంగా ఆ అవకాశం రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.