శుక్రవారం సర్దార్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ యార్డు వరకు నిర్వహించ తలపెట్టిన 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమానికి రైల్వే స్టేషన్ లో అనుమతి లేదని రైల్వే పోలీసులు బిజెపి నాయకులకు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన రైల్వే అధికారులు తమకు అనుమతి నిరాకరించడం ఏంటి అని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.