మధిర శివాలయంలో కార్తీక శోభ

కార్తీక పౌర్ణమి సందర్భంగా మధిర శివాలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళా భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప భక్తుల శివనామస్మరణతో ఆలయంలో సందడి నెలకొంది. ఆలయంలో ఏర్పాట్లు బాగుండటంతో భక్తులు ఇబ్బందులు లేకుండా దైవదర్శనం చేసుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్