మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సోమవారం ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు దళారులపై ఆధారపడకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి కే చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.