మంగళవారం సాయంత్రం మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న మధిర వాసి నంబూరి రామారావును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రామారావు తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.