మధిర: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

ఖమ్మం నుండి మధిరకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు సజ్జ శోభన్ బాబు తన ₹18,000 విలువైన realme మొబైల్ ఫోన్ను మర్చిపోయాడు. బస్సు మధిర బస్టాండ్ చేరుకున్నాక, కండక్టర్ షేక్ నాగుల్ మీరా, డ్రైవర్ ఆర్.శ్రీను మొబైల్ను గుర్తించి, అందులోని నంబర్ల ద్వారా ప్రయాణికుడిని సంప్రదించారు. సెక్యూరిటీ సిబ్బంది రాజేష్ సమక్షంలో మొబైల్ను ప్రయాణికుడికి అప్పగించారు. తన మొబైల్ను తిరిగి అందించినందుకు సదరు ప్రయాణికుడు కండక్టర్, డ్రైవర్, డిపో మేనేజర్ డి. శంకర్రావు, మధిర డిపో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్