మధిర మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజెన్సీ నిర్వాహకులు (కాంట్రాక్టర్) వినీత్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాలు తగ్గిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్డు మధ్యలో మాన్ హోల్ వద్ద ఏర్పడిన గుంతలను వెంటనే పూడుస్తామని, వర్షం కారణంగానే కొంత జాప్యం జరిగిందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు.