సీపీఎం నేత రామారావు హత్య నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్ రాజు సోమవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలు పెరిగాయని, హత్యను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. హత్య జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను ఎందుకు పట్టుకోలేదని భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.