పాతర్లపాడు సీపీఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ, దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో సీపీఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన సభలో సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ, హత్యలతో ఉద్యమాలను ఆపలేరని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కమ్యూనిస్టులను, ఎర్రజెండాను రూపుమాపాలని చూస్తే అది అవివేకమని అన్నారు.