నేలకొండపల్లి బౌద్ధ స్థూపం సందర్శన అనంతరం పురావస్తుశాఖ సంచాలకులు కె. అర్జున్ రావు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని వారి ఛాంబర్‌లో కలిశారు. జిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. బౌద్ధ క్షేత్రంలోని మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లను పరిశీలించిన అనంతరం, సంరక్షణ పనుల కోసం రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బౌద్ధ క్షేత్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసి, నెల రోజులలో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.