ఖమ్మం: నేడు ఆ ప్రాంతాల్లో కరెంట్ బంద్

33/11 కేవీ కుసుమంచి సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం కుసుమంచి, తురకగూడెం, లోక్యతండా, కోక్యతండా, లింగారాంతండా, జిబి తండా, గురవాయిగూడెం గ్రామాలను, అలాగే వ్యవసాయ మోటార్లను ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని స్థానిక ఏఈ డి. అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్