తల్లాడలో దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహణ

తల్లాడలో శనివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గామాత శోభాయాత్ర ఘనంగా జరిగింది. పది రోజుల పాటు పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. మహిళలు కోలాటాలు, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్