సాంకేతిక విద్యతోనే ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. కల్లూరు మండలంలో పేరువంచ జెడ్పీ ఉన్నత పాఠశాలలో, కల్లూరు, పెనుబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఫ్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజదేవి, హైస్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహసీల్దార్ పులి సాంబశివుడు ఉన్నారు.