కల్లూరు: అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు గురువారం కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, కాకర్లపల్లి బోడు కాలనీలో డ్రైనేజీలు, సి. సి. రోడ్లు నిర్మించాలని కోరుతూ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా సభ్యులు జాజిరి శ్రీనివాసరావు, జాజిరి జ్యోతి, తన్నీరు కృష్ణార్జునరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్