మంగళవారం, సత్తుపల్లి డివిజనల్ విద్యుత్ ఇంజినీర్ లోనావత్ రాములు నాయక్ వేంసూరు మండల పరిధిలోని రాయుడుపాలెం విద్యుత్ సెక్షన్ పరిధిలో పలు లైన్లను, సబ్ స్టేషన్ లను, రాయుడుపాలెం విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీరాపల్లి టు మర్లకుంట నూతన లైన్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు, దీనివల్ల బీరాపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ అనీల్ కూడా ఉన్నారు.