సింగరేణి మండల కేంద్రంలోని శ్రీ విఘ్నేశ్వర విశ్వేశ్వర సీతారామాంజనేయ స్వామి (శివాలయం) దేవస్థానంలో దుర్గాదేవి అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగాని శ్రీనివాసరావు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని వారు కోరారు.