ఆదివారం వైరాలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బోళ్ళ గంగారావు, మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ లు నూతన ఛైర్మన్ ను సన్మానించారు.