నేడు తిమ్మారావుపేట సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కోత

ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ ఉమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8. 30 గంటల నుంచి 10 గంటల వరకు తిమ్మారావుపేటలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ మరమ్మతుల నిమిత్తం విద్యుత్ కోత విధిస్తున్నట్లు చెప్పారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్