వైరా రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 20.4 అడుగులకు చేరిన నీటి మట్టం, ప్రస్తుతం 19.1 అడుగులకు చేరింది. సుమారు 7వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండటంతో వైరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.