వైరా: సన్న బియ్యం నిల్వలను పరిశీలించిన కార్పొరేషన్ ఛైర్మన్

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు వైరా వ్యవసాయ మార్కెట్ లోని గిడ్డంగుల సంస్థ గోడౌన్లను తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యతను, నిల్వలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన సన్న బియ్యం నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి, గోడౌన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టీపిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్