ఇల్లందు పట్టణంలో ఆదివారం భూమిని అమ్మవద్దని అన్నందుకు భర్త జక్కుల గోపిపై అతని భార్య, బావమరిది కలిసి దాడి చేశారు. ఈ దాడిలో గోపి తలకు గాయాలయ్యాయి. బాధితుడు కొత్తగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.