ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆధునిక క్షిపణి ఉత్పత్తి కర్మాగారాన్ని, ఆటోమేటెడ్ తయారీ ప్రక్రియను పరిశీలించారు. రాబోయే రోజుల్లో బీజింగ్‌లో జరిగే సైనిక పరేడ్‌కు హాజరుకానున్న ఆయన, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో పాల్గొంటారు. అంతర్జాతీయ ఆంక్షల నడుమ రష్యా–చైనా మద్దతుతో క్షిపణి ఉత్పత్తిని బలోపేతం చేస్తోన్న ఉత్తర కొరియా, ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆనయ ఆదివారం క్షిపణుల కర్మాగారాన్ని సందర్శించారు.