అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకునే క్రమంలో రెస్క్యూ బృందం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. డెహ్రాడూన్‌లోని భావువాలా గ్రామంలో పొడవైన కింగ్ కోబ్రా స్థానికులకు కనిపించింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం సభ్యులు ఘటనా స్థలికి వెళ్లారు. పామును పట్టుకునే క్రమంలో అది వీరిపై దాడికి దిగింది. దీంతో తక్షణమే అప్రమత్తమై దాడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం అతి కష్టం మీద పామును పట్టుకున్నారు.