కేరమేరి మండలంలోని ఆనార్పల్లి గ్రామంలో దివంగత మాజీ ఎంపీపీ రాథోడ్ గోవింద్ నాయక్ 5వ వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు రాథోడ్ రాజేందర్ నాయక్ 'రాథోడ్ రాజేందర్ నాయక్ లండన్ రాంరావు బాపు గోపి గోవింద్ నాయక్ (ఆర్ జి జి)' అనే చారిటీ ట్రస్ట్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గ్రామాలలో సరైన వైద్యం అందక, డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా గర్భిణీలు, గుండె సంబంధిత రోగులు అంబులెన్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్వరలో అంబులెన్స్ ను ప్రారంభిస్తామని తెలిపారు.