జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా, శుక్రవారం కౌటాల సీఐ బి. సంతోష్, ఎస్‌ఐ డి. చంద్రశేఖర్ నాయకత్వంలో 2కే రన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కౌటాల స్టేడియం నుండి తలోడి క్రాస్ రోడ్ వరకు జరిగిన ఈ పరుగులో పోలీసు సిబ్బంది, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ ఐక్యత, సమగ్రతకు సంకేతమని అధికారులు తెలిపారు.