ఈస్గాం ఆలయంలో జ్వాలా తోరణం- పాల్గొన్న కలెక్టర్

కాగజ్నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, దీపాలు వెలిగించారు. బుధవారం సాయంత్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రే స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిసేవ, జ్వాలా తోరణంలో పాల్గొన్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్