అన్నపురెడ్డిపల్లి 33కేవీ లైన్ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల నేపథ్యంలో, మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్నపురెడ్డిపల్లి, తొట్టిపంపు, వడ్డుగూడెం, వెంకటాపురం, బుచ్చన్నగూడెం, మర్రిగూడెం, పెంట్లం, నామవరం, రాజాపురం, కంపగూడెం, భాస్కరపురం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.