సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు సయ్యద్ సలీం డిమాండ్ చేశారు. అశ్వారావుపేటలో శుక్రవారం జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ జాబితాలో పేరుండి, అవార్డు విచారణ పూర్తయినా ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.