మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసు దహనం: పోలీసుల ముందస్తు అరెస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తగలబెట్టిన ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా స్థానిక బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై నిరసన తెలిపారు. తమ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండించిన వారు, దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని, అక్రమ కేసులు, దాడులకు భయపడేది లేదని, తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్