దమ్మపేట మండలం అప్పారావుపేటలో మంగళవారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. ఒక ఏడాది చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గాయపడిన వారిని స్థానికులు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కల బెడద నివారించడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.