మంగళవారం దమ్మపేట మండలంలో పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన తోట నాగమణి (45) అనే మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను అశ్వరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.