భద్రాచలం: ట్రస్ట్ బోర్డు కమిటీని నియమించిన తెల్లం

భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీని శనివారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నియమించారు. కమిటీ ఛైర్మన్గా సుదర్శన్ రావు, బోర్డు డైరెక్టర్లుగా సుధాకర్, శ్రీనివాస్, సతీష్ కుమార్, సాగర్, రాఘవరావు, వెంకటరమణలను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్