దుమ్ముగూడెం మండలం పైడిగూడెంలో శనివారం షార్ట్ సర్క్యూట్ తో కనీతి సమ్మయ్య ఇల్లు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధితులను పరామర్శించి, రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వంట సామాగ్రి, వ్యక్తిగతంగా 50 కిలోల బియ్యం, రూ. 4వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.